జూలై నుంచి వరుణ్ తేజ్ – పూరి సినిమా

Puri-Jagannadh-and-Varun-te
హన్డ్సం లుక్ తో ఉండే వరుణ్ తేజ్ మెగాస్టార్ బ్రదర్ అయిన నాగబాబు కొడుకు. వరుణ్ తేజ్ తన తొలి సినిమా కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాడు. మాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఆ సినిమా జూలై చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంచనా వేస్తున్న ఈ సినిమాకి అశ్వినీదత్ నిర్మాత. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని కూడా అశ్వినీదత్ నిర్మాతగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లాంచ్ చేసారు. ఇప్పుడు అదే రీతిలో రామ్ చరణ్ కజిన్ వరుణ్ తేజ్ ని కూడా అదే కాంబినేషన్లో చేస్తున్నారు.

తన హాన్డ్సం లుక్స్ తో ఇప్పటికే వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను మాకు అందగానే మీకు తెలియజేస్తాము.

Exit mobile version