మెగా బ్రదర్స్ లో ఒకడైన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిరంగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగావున్న సంగతి తెలిసిందే. అయతే ఈ సినిమా పూరి జగన్నాధ్ తో వుంటుందని ముందుగా అనుకున్నారు. కానీ పూరి నితిన్ తో ‘హార్ట్ ఎటాక్’ ను ప్రకటించాక వరుణ్ తో సినిమా ఉండదని ఖరారు అయినట్లే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది.