వరుణ్ తేజ్ మూవీ ముహూర్తానికి ఖరారైన తేదీ

వరుణ్ తేజ్ మూవీ ముహూర్తానికి ఖరారైన తేదీ

Published on Jan 28, 2014 1:15 PM IST

varun-tej
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలోనే హీరోగా తెలుగు చిత్ర సీమలో అరంగేట్రం చేయనున్నాడు. చాలా రోజుల నుంచి ఆ సినిమా ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది, అప్పుడు మొదలవుతుంది అని చెప్పుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ముహూర్తపు తీదీని ఖరారు చేసారు. ఫిబ్రవరి 27న ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలంతా వచ్చే అవకాశం ఉంది.

గతంలో ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలు చేసిన శ్రీ కాంత్ అడ్డాల ఈ సినిమాకి డైరెక్టర్. నల్లమలపు బుజ్జి – ఠాగూర్ మధు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి గొల్లభామ అనే టైటిల్ ని అనుకుంటున్నారు, కానీ ఈ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాలో హీరోయిన్, నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు