మార్చి 23న ప్రియతమా నీవచట… అనబోతున్న వరుణ్ సందేశ్

మార్చి 23న ప్రియతమా నీవచట… అనబోతున్న వరుణ్ సందేశ్

Published on Mar 17, 2013 12:46 PM IST

Priyathama_Neevachata_Kusal

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా మార్చి 23న రిలీజ్ కానుంది. హసిక , కోమల్ ఘా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం త్రినాధ రావు డైరెక్టర్. జె సాంబశివరావు నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగాన్ని రాజమండ్రి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్స్ బాగున్నాయి కానీ బాక్స్ ఆఫీసు వద్ద సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. త్రినాధ రావు మొదటి సినిమా ‘మేం వయసుకు వచ్చాం’ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్నే అందుకుంది.

ప్రస్తుతం త్రినాద రావు తన తదుపరి చిత్రం కూడా వరుణ్ సందేశ్ తో చేస్తున్నారు. హరి ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘నువ్విలా నేనిలా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇటీవలే వచ్చిన ‘చమ్మక్ చల్లో’ తో పరాజయాన్ని అందుకున్న వరుణ్ సందేశ్ ‘ప్రియతమా నీవచట కుశలమా’ తో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాడు. ఈ సినిమా తర్వాత అతను నటించిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘సరదాగా అమ్మాయిలతో’, ‘డీ ఫర్ దోపిడీ’, ‘నువ్విలా నేనిలా సినిమాలతో మన ముందుకు రానున్నాడు.

తాజా వార్తలు