మెగా హీరో వరుణ్ తేజ్ ఇంటి దగ్గర కష్టపడిపోతున్నాడు. ఆయన నిపుణుల సమక్షంలో బాక్సింగ్ లో మరింత మెళకువలు తెలుసుకుంటున్నారు. వరుణ్ తేజ్ తన పదవ చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రముఖ భారత బాక్సింగ్ క్రీడాకారుల దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలు కావాల్సివుంది.
ఐతే కరోనా వైరస్ కారణంగా వ్యాయామశాలలు సైతం మూసివేయడం జరిగింది. దీనితో వరుణ్ ఇంటిదగ్గరే బాక్సింగ్ కసరత్తులు చేస్తున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకట్, సిద్దు ముద్దా నిర్మిస్తున్నారు.