ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : నవంబర్ 02, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : కృష్ణ చైతన్య, మృదుల అయ్యంగర్, బేబీ ప్రణీత తదితరులు
దర్శకత్వం : తేజ
నిర్మాత : కే రాఘవేంద్రరావు బి ఏ
సంగీతం : సాయి మధుకర్
ఛాయాగ్రహణం : గంగనమోని శేఖర్
కూర్పు : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన లఘు చిత్రమే ‘సింధు భైరవి’. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తేజ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
సింధు (మృదుల అయ్యంగర్) అలాగే భైరవ్ (కృష్ణ చైతన్య) లు సంగీతం పరంగా ఎంతో నిష్ణాతులు పైగా అనేక ప్రోగ్రాం లు కూడా ఇస్తూ ఉంటారు. అయితే వీరి సంగీత పరంపర ముందుకు కొనసాగించడానికి ఒక వారసత్వం అవసరం అవుతుంది. కానీ వారికి సంతాన ప్రాప్తి కలిగేందుకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఈ క్రమంలో భైరవ్ తన ఫ్రెండ్ ద్వారా ఓ ఫెర్టిలిటీ సంస్థ కోసం తెలుసుకొని వారిని సంప్రదించి ఒక పాపను కంటారు. ఇలా కొన్నాళ్ల హ్యాపీ లైఫ్ అనంతరం ఆ పాప విషయంలో ఓ షాకింగ్ నిజాన్ని భైరవ్ తెలుసుకుంటాడు. మరి ఆ నిజం ఏంటి? అక్కడ నుంచి భైరవ్ ప్రవర్తన ఎలా మారింది? మళ్లీ పాపను అతను దగ్గరకి తీసుకున్నాడా లేదా? ఈ క్రమంలో భైరవ్ వెనుకున్న ట్విస్ట్ ఏంటి, తమ సంగీత వారసత్వ పరిస్థితి ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి ఈటీవీ విన్ కథాసుధలో ఇది వరకు పలు ఎపిసోడ్స్ వచ్చాయి. అయితే వాటితో పోలిస్తే తన నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో ఆ తరహా ఎలిమెంట్స్ ఇందులో ఒకింత బాగానే ఉన్నాయని చెప్పాలి. సంగీతం పరంగా తన టేస్ట్ ఎలాంటిది అనేది పలు చిత్రాల్లో చూసాం.
అలానే ఇందులో కొంచెం భిన్నమైన లైన్ తీసుకొని దానికి అల్లుకున్న కథనం డీసెంట్ గా సాగింది అని చెప్పాలి. అలాగే సింధు, భైరవ్ నడుమ డ్రామా కూడా బాగుంది. వారి మధ్య ఫ్యామిలీ సీన్స్ అలానే ఎమోషన్స్ బాగున్నాయి. వీటితో పాటుగా వారి కూతురుగా చేసిన చిన్నారి బేబీ ప్రణీత చక్కగా తన రోల్ చేసింది.
కృష్ణ చైతన్య, మృదుల తమ రోల్స్ లో సాధ్యమైనంత వరకు బాగా చేసారు. ఇక వీరి స్నేహితులుగా కనిపించిన నటులు వారిపై అక్కడక్కడా కామెడీ బాగున్నాయి. అలాగే ట్విస్ట్, క్లైమాక్స్ లో ఎమోషనల్ మూమెంట్స్ డీసెంట్ గా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో మూమెంట్స్ ఒకింత బాగానే ఉన్నప్పటికీ కథ, కథనాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి అని చెప్పాలి. మెయిన్ అంశాలు వరకు ఊహాజనీతంగానే సాగే కథనం అందరినీ మెప్పించ లేకపోవచ్చు.
అలాగే క్లైమాక్స్ పోర్షన్ లో కూడా కృష్ణ చైతన్య రోల్ పై ట్విస్ట్ కూడా ముందే ఊహించేసే లానే ఉంటుంది. సో మరీ కొత్తదనం లాంటివి కోరుకునే వాటికి ఇలాంటివి అంత రుచించకపోవచ్చు. ఇక కృష్ణ చైతన్య రోల్ లోని గ్రే షేడ్స్, ఆకస్మిక మార్పు లాంటివి కూడా అన్ని వర్గాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావు.
ముందు అంతా అంత మృదు స్వభావిగా చూపించి అతని రోల్ తర్వాత అంతలా రియాక్ట్ అవ్వడం అనేది నాచురల్ గా ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలానే కృష్ణ చైతన్య నటన కూడా ఇంకా మెరుగ్గా చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం టాప్ నాచ్ లో ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా మంచి రిచ్ గానే ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం బాగుంది, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు తేజ విషయానికి వస్తే.. రాఘవేంద్రరావు గారు ఇచ్చిన కథని తెరపై బాగానే ఆవిష్కరించారు. పెద్దగా బోర్ లాంటిది లేకుండా డీసెంట్ గానే సాగించేసారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “సింధు భైరవి” అనే లఘు చిత్రం ఒకింత రెగ్యులర్ గానే అనిపించినా బాగానే ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా రాఘవేంద్రరావు మార్క్ సంగీతం టేస్ట్, ఎమోషన్స్ లాంటివి కోరుకునేవారికి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది. మిగతా ఆడియెన్స్ కి మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
