ప్రపంచ ఛాంపియన్లకు సినీ ప్రముఖుల ప్రశంసలు !

తొలిసారి మహిళా ప్రపంచకప్‌ను గెలుచుకొని టీమ్‌ ఇండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్‌ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ బృందంను అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘భారత్‌ కీర్తి రెపరెపలాడుతోంది. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినందుకు టీమ్‌ ఇండియా మహిళల జట్టుకు అభినందనలు. మీరు ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా విజయాన్ని సాధించారు. భారతీయులంతా మీ అద్భుతమైన విజయానికి సలాం చేస్తున్నారు’ – జూ. ఎన్టీఆర్‌

‘‘భారతీయ క్రికెట్‌ చరిత్రలో ఇది చరిత్రాత్మకమైన రోజు. గొప్ప సంచలనాత్మక విజయాన్ని సాధించిన మన భారత మహిళా క్రికెట్‌ జట్టుకు అభినందనలు. ఇది కలలు కనే ధైర్యం చేసిన ప్రతి యువతి విజయం, మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండండి’’ – మెగాస్టార్ చిరంజీవి

“టీమ్‌ ఇండియా తొలిసారిగా మహిళల ప్రపంచకప్‌ గెలుచుకుంది. భారతీయ క్రికెట్‌ చరిత్రలోనే ఇది అద్భుతమైన రోజు’’ – విక్టరీ వెంకటేశ్‌

‘మన ఛాంపియన్స్‌కు అభినందనలు’’- ప్రియాంక చోప్రా

‘‘మన అమ్మాయిలు ప్రపంచ ఛాంపియన్లు’’ – అడివి శేష్‌

Exit mobile version