వర్ణ తమిళ వెర్షన్ కి ‘యు’ సర్టిఫికేట్

వర్ణ తమిళ వెర్షన్ కి ‘యు’ సర్టిఫికేట్

Published on Nov 5, 2013 7:30 PM IST

Varna
యోగ బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్న సినిమా ‘వర్ణ’. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళ వెర్షన్ ‘ఇరందం ఉలగమ్’. తమిళ వెర్షన్ ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తమిళ వెర్షన్ కి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. తెలుగు వెర్షన్ కూడా త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. రెండు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తప్పనిసరిగా రెండు చోట్లా సెన్సార్ చేయాలి.

హారీష్ జైరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని ఇటీవలే హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ సినిమాలో ఇది వరకు ఎన్నడూ తెరపై చూపించని కొత్త కథతో తెరకెక్కించారు. ఆర్య హీరోగా కనిపించనున్నాడు. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రసాద్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై నిర్మించాడు.

తాజా వార్తలు