త్వరలో వర్ణ టీజర్

Varna-(2)
అనుష్క, ఆర్య జంటగా నటిస్తున్న ‘వర్ణ’ ఈ ఏడాదిలో తెలుగు, తమిళ భాషలలో ఘనంగా విడుదలకానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో విజువల్ ట్రీట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాత ప్రసాద్ వి పోట్లురి పి.వి.పి సినిమాస్ బ్యానర్ పై దాదాపు 55కోట్లు ఖర్చుపెట్టాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ పోస్టర్ సినేమాపైన అంచనాలను పెంచింది. ఇప్పుడు ఆర్యను ఒక విభిన్న రూపంలో చూపెడుతూ సెల్వరాఘవన్ మరో పోస్టర్ ను విడుదల చేసాడు. ఆగష్టు 3న ఈ సినిమా టీజర్ విడుదలకానుంది. అదే నెలలో ఆడియోను కూడా విడుదల చేస్తారు. హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హైదరాబాద్, చెన్నై మరియు జార్జియా తదితర ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో ఇది ఒక భారీ బడ్జెట్ సినిమాగాతెరకెక్కుతుంది. ఇందులో యాక్టర్ల నటన, గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి

Exit mobile version