వర్మ ఏమి కోరుకుంటున్నారో పవన్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు.

వర్మ ఏమి కోరుకుంటున్నారో పవన్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు.

Published on Jul 23, 2020 12:02 PM IST

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడమే వర్మ పనిగా పెట్టుకున్నాడు. పవన్ ని ఎవరైనా పల్లెత్తి మాటంటే విరుచుకు పడే ఫ్యాన్స్ కోపమే వర్మ ఆయుధంగా మార్చుకుంటున్నాడు. ఆయన సినిమాలలో విషయం లేకపోయినా ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేసి చేసే రచ్చ, వర్మకు ప్లస్ అవుతుంది. వర్మ కోరుకునేది కూడా అదే, పవన్ వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా పోస్టర్స్. సాంగ్స్, ట్రైలర్స్ ఉంటే ఫ్యాన్స్ ఊరుకోరని వర్మకు తెలుసు. వారికి కోపం తెప్పించి తన మూవీకి ప్రచారం కల్పించుకోవాలి అనేది అతని ప్లాన్.

వర్మ తాజా చిత్రం పవర్ స్టార్ విషయంలో కూడా అదే జరుగుతుంది. వర్మకు వ్యతిరేకంగా కొందరు ఫాన్స్ దర్శకులుగా మారారు. పరాన్నజీవి, పోర్న్ జీవి అనే టైటిల్స్ తో సినిమాలు ప్రకటించడంతో పాటు, వర్మపై ఓ సాంగ్ కూడా వదిలారు. నేను చెడ్డవాడిని అని చెప్పుకొనే వర్మలో పవన్ ఫ్యాన్స్ చెడ్డగా చూపించాడనికి ఏముంది చెప్పండి. వర్మకు మరో రూపంలో పబ్లిసిటీ తప్ప. అందుకే ఎంత వద్దనుకున్నా పవన్ ఫాన్స్ వర్మకు కావలసిందే చేస్తున్నారు.

తాజా వార్తలు