వర్మ నెక్స్ట్ మూవీ టైటిల్ ‘అల్లు’.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నేడు మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అల్లు అనే టైటిల్ తో ఆయన ఓ మూవీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక అల్లు అనే టైటిల్ పెట్టడం వెనుక కారణం కూడా ఆయన చెప్పడం జరిగినింది. అల్లు మూవీలోని ప్రధాన పాత్ర ఎప్పుడూ ఆలోచనలు, ఐడియాలు అల్లుతూ ఉంటాడట. అందుకే ఈ చిత్రానికి అల్లు అని టైటిల్ పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే పవర్ స్టార్ మూవీతో రచ్చ చేసిన వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెరలేపినట్లు తెలుస్తుంది.

కాగా వర్మ త్వరలో థ్రిల్లర్ అనే మూవీ విడుదల చేయనున్నారు. అప్సర రాణి నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అలాగే పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న మర్డర్ మూవీ కూడా ఆయన విడుదలకు సిద్ధం చేశారు. ఈ రెండు చిత్రాలు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానున్నాయి.

Exit mobile version