నగ్నం ఎవరూ చూడక పోయినా వర్మకు వచ్చే నష్టం లేదు

నగ్నం ఎవరూ చూడక పోయినా వర్మకు వచ్చే నష్టం లేదు

Published on Jun 27, 2020 7:06 PM IST

కొద్దిరోజుల క్రితం వర్మ మియా మాల్కోవా హీరోయిన్ గా ఓ అడల్ట్ కంటెంట్ మూవీ తీశారు. ఆ మూవీ ప్రోమోలతో యువతను బాగా రెచ్చగొట్టాడు. దానితో ఆ మూవీ కోసం జనం ఎగబడ్డారు. వంద రూపాయలు చెల్లించి మరి ఆ సినిమా చూశారు. తీరా మూవీ చూశాక తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వారు కోరుకున్నవి ఏవి ఆ సినిమాలో లేకపోవడంతో పాటు, తలా తోకా లేకుండా ఉన్న ఆ మూవీ చూసి వర్మను తిట్టుకున్నారు. ఏదైతే ఏమి వర్మకు భారీగా లాభాలు వచ్చాయి.

ఆ స్పూర్తితో నెల రోజుల లోపు మరో అడల్ట్ కంటెంట్ మూవీ ఆయన చేశారు. నగ్నం అనే ఆ మూవీ ప్రోమోలలో వర్మ క్రియేటివిటీ పరాకాష్టకు చేరిందన్న మాట వినిపించింది. మరి నేడు ఈ మూవీ రాత్రి 9 గంటల నుండి ప్రసారం కానుంది. ఐతే క్లైమాక్స్ విషయంలో మోసపోయిన ప్రేక్షుకులు వర్మ నగ్నం చూడకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. ఐతే ఈ మూవీ చూడక పోయినా వర్మకు వచ్చిన నష్టం ఏమి లేదు.. ఎందుకంటే ఓ ఇంటిలో ఊరు పేరు లేని నటులతో ఆయన చేసిన చిత్ర బడ్జెట్ 5 లక్షల లోపే అని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు