మార్చిలో రానున్న వర్మ – మోహన్ బాబుల ‘రౌడీ’

Rowdy_firstlook
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు సరికొత్త లుక్ లో, మంచు విష్ణు మరో ప్రధాన పాత్రలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రౌడీ’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని మార్చిలో రిలెజ్జ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

ఇటీవలే ఈ సినిమా మొత్తం చూసుకొన్న మోహన్ బాబు సినిమా చాలా బాగా వచ్చిందని, ఇంత బ్రిలియంట్ గా సినిమా తీసినందుకు వర్మకి థాంక్స్ చెప్పారు. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి కథానాయికగా కనిపించనుంది. ఏవి పిక్చర్స్ బ్యానర్ పై పార్థసారధి – గజేంద్ర – విజయ్ కుమార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version