రామ్ చరణ్ తాజా సినిమా ‘ఎవడు’ రేపు భారీ విడుదలకు సిద్ధంగావుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత.
ఈరోజు దర్శక నిర్మాతలు ఈ సినిమా విజయం సాధించాలని బంజారా హిల్స్ లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. ఇప్పటికే ఈ సినిమా ఆరు నెలలు వాయిదాపడినా తమ వంతు భాద్యతగా ప్రచారాన్ని అద్భుతంగా చేసారు, ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను అందుకుని సినిమా అంచనాలను అమాంతం ఒక్కసారిగా పెంచేశాయి. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్.