“మున్నా” మరియు “బృందావనం” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ఈరోజు తనకు ఎటువంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంటులు లేవని దృవీకరించారు. తన పేరు మీద నకిలీ ఎకౌంటు లు సృష్టించారని తెలుసుకున్న వంశీ ముందు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషయం గురించి చెప్తూ ” కొన్నాళ్ళ క్రితం ఒకరు ఫోన్ చేసి వాళ్ళు ఫోటో షూట్ చేశామని తెలిపారు ఏంటని అడిగితే పేస్ బుక్ లో వాళ్ళతో సంభాషణ జరిపామని అంటున్నారు.అందులో ఫోటో షూట్ చెయ్యమని నేను చెప్పానని అన్నారు. ఈ మధ్యన మరొక కథానాయిక ఫోన్ చేసి తనకి అసభ్య కరమయిన మెసేజ్ లు ఎందుకు పంపుతున్నావు అని అడిగింది అప్పుడు నాకు అర్ధం అయ్యింది ఎవరో నా పేరు ఉపయోగించి ఇదంతా చేస్తున్నారు అని. నా టీం ఆ ఎకౌంటు సృష్టించిన వాళ్ళని ఎకౌంటు డిలీట్ చెయ్యమని అడిగారు కూడా చెయ్యకపోగా వాళ్ళు నా టీంని అసభ్యకరంగా మాట్లాడటం మొదలు పెట్టారు అందుకే నేను ఫిర్యాదు చెయ్యడానికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను నాకు ఎటువంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎకౌంటులు లేవు” అని అన్నారు. గతంలో ఇలా నయనతార మరియు ఇంకొందరు ప్రముఖుల పేర్ల మీద ఎకౌంటులు సృష్టించారు వారు కూడా ఇలానే పోలీసు ఫిర్యాదు చేశారు.