ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుకి చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం పవన్ నుంచి చాలా కాలం తర్వాత వస్తుండడంతో పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం అందాకా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.దీనితో ఇక ఈ గ్యాప్ లో వకీల్ సాబ్ అప్డేట్ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ పుట్టిన రోజు వస్తుండడంతో వకీల్ సాబ్ యూనిట్ నుంచి ఒక అప్డేట్ వస్తుందని హింట్ ఇస్తూ వస్తున్నారు. కానీ వారు ఏం ఇస్తారు అన్నది క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు మాత్రం అందుకు క్లారిటీ వచ్చేసింది. పవన్ పుట్టినరోజు నాడు వకీల్ సాబ్ టీం నుంచి మోషన్ మోస్టర్ రావడం కన్ఫామ్ అయ్యింది. ఆ అప్డేట్ ను దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు అధికారికంగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. సో వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్ ఒకటి రెడీ అవుతుంది. మరి మిగతా ప్రాజెక్టుల నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో చూడాలి.