వకీల్ సాబ్ ఆరంభం అదిరిపోనుందట..!

వకీల్ సాబ్ ఆరంభం అదిరిపోనుందట..!

Published on Apr 22, 2020 3:02 PM IST

పవన్ కమ్ బ్యాక్ మూవీపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఇది సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం అయినప్పటికీ పవన్ ఇమేజ్ రీత్యా కొన్ని కమర్షియల్ హంగులు అద్దడం జరిగింది. ఒకటి రెండు ఫైట్ సన్నివేశాలు, హీరోయిన్ తో సాంగ్ వంటివి కలిపారు. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ మూవీలో పవన్ ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారట దర్శకుడు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ సీన్ మొదలు అవుతుందట. ఈ సన్నివేశం ఫ్యాన్స్ కి మజా పంచడం ఖాయం అని అంటున్నారు.

ఇక దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా నివేదనా థామస్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో విరూపాక్ష అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తుండగా షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ తో చేయనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వకీల్ సాబ్ లాక్ డౌన్ అనంతరం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు