చిరంజీవి లుక్..శ్రీదేవి కాస్ట్యూమ్స్ స్వయంగా సెట్ చేసుకున్నారట

టాలీవుడ్ లో ఫాంటసీ సినిమాలు కొత్తేమి కాదు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ కాలం నాటినుండి ఈ తరహా కథలు వస్తున్నాయి. ఐతే 1990 దర్శకుడు రాఘవేంద్ర రావు మరియు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ అందుకొని బెస్ట్ వన్ గా నిలిచింది. మే 9కి ఈ చిత్రం విడుదలై 30 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈనేపధ్యంలో ఈ ఎపిక్ మూవీని నిర్మించిన వైజయంతి మూవీస్ ఆ మూవీ తెరపై కి రావడానికి కారణమైన సంఘటనలు పంచుకుంటున్నారు.

హీరో నాని వాయిస్ ఓవర్ తో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు అసలు బీజం ఎక్కడ పడిందో ఓ వీడియో విడుదల. ఇక ఈ మూవీ బేసిక్ ఐడియా శ్రీనివాస్ చక్రవర్తి.. దర్శకుడు రాఘవేంద్ర రావుకి చెప్పారట. ఆ స్టోరీ లైన్ ఆధారంగా కథను యండమూరి వీరేంద్రనాధ్, జంధ్యాల, విజయేంద్ర ప్రసాద్ లతో పాటు తమిళ రచయిత క్రేజీ మోహన్ కలిసి తయారు చేశారట. ఇక హీరోయిన్ గా శ్రీదేవి ఐతే బాగుంటుంది అని అనుకున్నారట.

ఐతే ఈ సినిమాలో తన లుక్ ఐడియా చిరంజీవి స్వయంగా ఇచ్చారట.కథా చర్చలలో కూడా చిరంజీవి పాల్గొనడం జరిగిందట. ఇక శ్రీదేవి ముంబై లో తన దేవ కన్య పాత్రకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నారట. ఈ విధంగా చిరంజీవి, శ్రీదేవి నటులుగానే కాకుండా ఆ సినిమాలోని కొన్ని కీలక విషయాలలో ఇన్వాల్వ్ అయ్యారట.

Exit mobile version