త్వరలో ఉయ్యాలా జంపాలా ఆడియో

త్వరలో ఉయ్యాలా జంపాలా ఆడియో

Published on Dec 8, 2013 9:30 PM IST

Uyyala_Jampala
రాజ్ తరుణ్, ఆనంది నటిస్తున్న సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. విరంచి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామ్ మోహన్ -నాగార్జున కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ”ఉయ్యాలా జంపాలా’ లాంటి పూర్తి లవ్ స్టొరీ సినిమాకి మేము అన్నపూర్ణ స్టూడియోస్ బాగస్వాములు కావడం చాలా గర్వంగా వుంది. ఈ సినిమాలో నటిస్తున్నహీరోయిన్ ఆనంది ఇప్పటకే టీవీ సీరియల్స్ లో నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేము ఈ సినిమాతో ఆమెని సినిమాలోకి పరిచయం చేస్తున్నాము. ఈ సినిమాలో ఇద్దరు యాక్టర్స్ బాగా నటించారు’. అని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. విడుదల తేది ఈ వారంలో ప్రకటించవచ్చు. సన్నీ ఎంఆర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి విశ్వ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా విభిన్న ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం.

తాజా వార్తలు