చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఆనంది, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. ఈ సినిమా ట్రైలర్లు చూసాక ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి. సురేష్ బాబు సమర్పణలో రామ్ మోహన్ – నాగార్జున కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర టీం ఈ సినిమాని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ సినిమాకి విశ్వ సినిమాటోగ్రాఫర్. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన ఈ స్వచ్చమైన ప్రేమకథ మంచి విజయాన్ని అందుకుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది.