సూర్య-సమంతల సినిమా హక్కులను దక్కించుకున్న యు టి.వి సంస్థ

Surya-Samantha-Film
గత కొన్నేళ్ళగా యు టి.వి సంస్థ ఇక్కడ సినిమాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా తమిళ రంగంలో జెండాపాతుతుంది. ‘వెట్టై’, సెట్టే, ఇవన్ వెరా మాతిరి వంటి సినిమాలను తీసిన ఈ సంస్థ లింగుస్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా రానున్న సినిమా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది

సింగం విజయంతో సూర్య మంచి జోరుమీద వుండడంతో ఈ ప్రాజెక్టు 2014కే హై లైట్ గా నిలవనుంది. ఈ సినిమాలో చాలాభాగం ముంబైలో తీశారు. సమంత హీరోయిన్. సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో కొత్త లుక్ తో కనబడనున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫర్

Exit mobile version