యాక్షన్ లోకి దిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎన్ని రోజులంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో చేస్తున్న అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధం అయ్యింది.

రీసెంట్ గానే హరిహర వీరమల్లు, ఓజి చిత్రాల షూటింగ్ లని పూర్తి చేసుకున్న పవన్ ఇపుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. ఈరోజు జూన్ 10 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పునః ప్రారంభం అయ్యినట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభం కాగా పవన్ ఈ జూన్ 12 లేదా 13 నుంచి సెట్స్ లో జాయిన్ అవుతారని టాక్. ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version