నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు ఇటు సినీ ప్రముఖులు కూడా తనకి ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి బాలయ్య చేస్తున్న చేయనున్న సినిమాలపై కూడా వచ్చిన సాలిడ్ అప్డేట్స్ మంచి హైప్ ని కూడా సెట్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు చేస్తున్న అఖండ 2 కాకుండా బాలయ్య తన కెరీర్ 111వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో వీరిద్దరి కలయికలో ఒక కొత్త రకం సినిమా రాబోతుంది అన్నట్టుగా వినిపిస్తుంది. ముఖ్యంగా గోపీచంద్ మలినేని అయితే ఇది వరకు చేయని ఒక కొత్త సబ్జెక్టుని ఎంచుకున్నట్టుగా టాక్. ఇలా ఒక భారీ హిస్టారికల్ డ్రామాకి కొత్త ప్రపంచంతో వీరు సన్నద్ధం అవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే జానర్లో సినిమా ఉంటుందో లేదో వేచి చూడాలి.