మన తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర యుద్ధం ఎప్పుడు నుంచో ఉంది. పలు సినిమాలు పలువురు బిగ్ స్టార్స్ నడుమ క్లాష్ లు ఎన్నో చూసాం. ముఖ్యంగా సంక్రాంతి బరి మనకి ఎంతో కీలకం కాగా ఈ ఏడాదిలో మాత్రం దసరా వార్ ఊహించని రీతిలో మారేలా ఉందని చెప్పాలి.
ఎందుకంటే ఈసారి దసరాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక అంచనాలు ఉన్న ఓజి సినిమా అలాగే నటసింహం బాలకృష్ణ నుంచి కూడా అదే రేంజ్ హైప్ ఉన్న భారీ సినిమా అఖండ 2 లు రాబోతున్నాయి. ఒక్క డేట్ కూడా అటు ఇటు కాకుండా సెప్టెంబర్ 25న రెండూ సినిమాలూ థియేటర్స్ లో ఒకదానితో ఒకటి ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.
అయితే దీనికి ఉండాల్సిన పొటెన్షియల్ ఇప్పుడు దానికి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రెండు సినిమాలకి ఓపెనింగ్స్ భారీ లెవెల్లోనే ఉంటాయి కానీ వాటితో పాటుగా ఓకే రోజు విడుదల కావడంతో మొత్తంగా రావాల్సిన వసూళ్ళలో కొంతమేర లెక్కలు తగ్గిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది.
మరి ఈ రెండు సినిమాలు ఓకే రోజు వస్తే విధ్వంసం గట్టిగానే ఉంటుంది అనేది అటుంచితే ఇప్పుడు నుంచే అభిమానుల్లో మాత్రం ఆ హీట్ మరింత పెరుగుతూ వస్తుంది. మరి ఈ రేస్ లో ఎవరు వెనక్కి వెళతారో ఎవరు విజేతగా నిలుస్తారో కాలమే నిర్ణయించాలి.