పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత పవన్ డేట్స్ ఇవ్వడంతో జెట్ స్పీడ్ లో హరీష్ ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. మరి ఇలా సినిమా రీసెంట్ క్రేజీ షెడ్యూల్ ని మేకర్స్ కంప్లీట్ చేశారు.
మరి ఈ షెడ్యూల్ లోనే పవర్ ప్యాకెడ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఓ ఎనర్జిటిక్ సాంగ్ అది కూడా పవన్ పై సాగేది కంప్లీట్ చేశారు. ఇవే కాకుండా కొన్ని పవర్ఫుల్ సన్నివేశాలు ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఇక దీనిపై హరీష్ పోస్ట్ చేసిన పోస్ట్ అండ్ పిక్ కూడా వైరల్ గా మారాయి. మొత్తానికి ఉస్తాద్ కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.