‘ఉప్పెన’ క్రేజీ సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్ !

‘ఉప్పెన’ క్రేజీ సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్ !

Published on May 12, 2020 1:47 AM IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా వస్తోన్న ‘ఉప్పెన’ సినిమా నుండి మార్చి 2న రిలీజ్ అయిన ‘నీ కన్ను నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో సాంగ్ సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. డిఎస్పీ మళ్ళీ ఈ సాంగ్ తో తానేంటో నిరూపించుకున్నాడు. మంచి ట్యూన్ తో కాస్త విభిన్నంగా సాంగ్ ను కంపోజ్ చేసి నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి జావేద్ ఆలీ గాత్రం మరింత బలం చేకూర్చింది.

శ్రీమణి సాహిత్యం కూడా సింపుల్ పదాలతో అర్ధవంతంగా ఉంది. మొత్తానికి సాంగ్ సినిమా పై అంచనాలను పెంచింది. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.

శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు