విడుదలకు ముందే మెగా హీరో రికార్డులు

విడుదలకు ముందే మెగా హీరో రికార్డులు

Published on May 12, 2020 2:37 PM IST

మెగా ఫ్యామిలీ నుండి హీరో ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ విడుదలకు ముందే రికార్డులు మొదలుపెట్టాడు. ఇంకా వెండితెరపై కనిపించకుండానే యూట్యూబ్ లో అద్భుతాలు చేస్తున్నాడు. ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ డెబ్యూ మూవీగా ఉప్పెన తెరకెక్కిన సంగతి తిలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఓ నెల క్రితమే ఈ మూవీ విడుదల కావాల్సివుంది, ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.

కాగా ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఈ ఆల్బమ్ లోని ‘నీ కన్ను నీలి సముద్రం…’ అనే సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. గత రెండు నెలలుగా ఈ సాంగ్ యూత్ ఫేవరేట్ సాంగ్ గా మారిపోయింది. కాగా యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ఔరా అనిపించింది. యూట్యూబ్ లో విడుదల చేసిన తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు