టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో తన హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు.
మరి తనపై నేడు బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ని విడుదల చేశారు. ఒక వింటేజ్ లుక్ ని తనపై వదిలారు. మరి ఈ లుక్ లో తాను హీరోగా ఎలా కనిపించనున్నారో దీనితో కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే ఉపేంద్ర రోల్ లో మంచి ఇంట్రెస్టింగ్ షేడ్స్ అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో ఉంటాయట. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.