ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో సరికొత్త మేకోవర్‌తో రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రామ్ బర్త్‌డే కానుకగా మే 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర సూర్య కుమార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.
ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.