రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త అప్డేట్ మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్గా ‘అన్న అంటేనే..’ అనే ఓ ఎమోషనల్ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో చిన్నప్పుడు తన సోదరుడితో కలిసి దిగిన ఫోటోను మనకు చూపెట్టారు. కాగా ఈ చిత్రంలో హీరో సోదరుడిగా సత్యదేవ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను జూలై 15న సాయంత్రం 5.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.