భారీగా అంచనాలు నడుమ రాబోతున్న గబ్బర్ సింగ్

భారీగా అంచనాలు నడుమ రాబోతున్న గబ్బర్ సింగ్

Published on May 10, 2012 3:17 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రేపు విడుదలవుతుండగా ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అన్ని ఏరియాల్లో ఇప్పటికే టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. టికెట్స్ కోసం అందరు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టికెట్లు మాత్రం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ అశేష అభిమాన గణం, హరీష్ శంకర్ చివరి చిత్రం ‘మిరపకాయ్’ భారీ హిట్ కొట్టడం, ఇప్పటికే విడుదలైన దేవి శ్రీ ప్రసాద్ పాటలు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ ప్రింట్స్ కూడా పంపడం జరిగింది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు