జనవరిలో భారీ రీతిలో ‘1 నేనొక్కడినే’ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించిన హక్కులను కళ్లుచెదిరే ధరకు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది.
ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన అనీల్ సుంకర సినీ చరిత్రలోనే మొదటిసారిగా ‘1’ ఆడియో వేడుకను ఈ రాష్ట్రంలో కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అంతే ఈ డిసెంబర్ 19నా ఈ సినిమా ఆడియో లాంచ్ ను హైదరాబాద్ లో జరుగుతుండగానే లైవ్ లో చూడచ్చు అన్నమాట
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మిగిలిన ఏకైక పాట చిత్రీకరణను డిసెంబర్ 11న ముంబైలో షూట్ చెయ్యనున్నారు. ఈ స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ లో మహేష్ సరసన కృతి సనన్ నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. అనీల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా విడుదలచెయ్యనున్నారు