సినీ అభిమానులకు, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేలా హీరో ఉదయ్ కిరణ్ నిన్న రాత్రి హైదరాబాద్లోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఉదయ్ కిరణ్ ముందుగా కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నిర్ణయం చెప్పి
ఇంటికి రమ్మన్నాడు. ఈ లోపు తనకి తానుగా ఉరివేసుకొన్నాడు.
ఉదయ్ కిరణ్ ఫ్రెండ్స్ ఇంటికి చేరుకున్నారు కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. అప్పటికీ వాళ్ళు ఉదయ్ కిరణ్ ని అపోలో హాస్పిటల్స్ కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తను చనిపోయినట్లు సమాచారం. ఈ యంగ్ హీరోకి ప్రస్తుతం కెరీర్ అంతంతమాత్రంగా ఉంది. ఉదయ్ కిరణ్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేదానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. ఉదయ కిరణ్ ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘మనసంతా నువ్వే’, ‘శ్రీ రామ్’, ‘నీ స్నేహం’ లాంటి హిట్ సినిమాల్లో నటించాడు.
ఉదయ్ కిరణ్ మరణానినికి చింతిస్తూ 123తెలుగు.కామ్ తరపున అతని కుటుంబానికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం.