అన్నవరంలో ఉదయ్ కిరణ్ వివాహం


ఉదయ్ కిరణ్ తను ప్రేమించిన అమ్మాయిని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారని ఇది వరకే తెలిపాము. వీరిద్దరి కళ్యాణ మహోత్సవం అన్నవరంలో జరగనుంది. ఉదయ్ కిరణ్ హైదరాబాద్ కి చెందిన విసిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యుల నేతృత్వంలో జరుగుతున్న ఈ పెళ్లి ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి పైన రత్నగిరిలో జరగనుంది. ఈ పెళ్ళిని బాగా గ్రాండ్ గా చేసుకోనున్నారు. ఉదయ్ బంధువుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ పెళ్ళికి ఉదయ్ కిరణ్ తనకి బాగా దగ్గరైన వారిని మాత్రమే ఈ పెళ్ళికి ఆహ్వానించారట. ప్రస్తుతం ఉదయ కిరణ్ ‘జై శ్రీరామ్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.

Exit mobile version