తేజ దర్శకత్వంలో “చిత్రం” అనే చిత్రంతో పరిచయమయ్యి “నువ్వు నేను” చిత్రంతో అతి తక్కువ కాలంలో ప్రసిద్ది చెందిన హీరో ఉదయ్ కిరణ్ ఈరోజు ఈ హీరో పెళ్లి అన్నవరంలో జరిగింది. రెండేళ్ళ క్రితం చిన్న కార్యక్రమంలో కలిసిన వీరు ఇద్దరి బంధం స్నేహంగా మొదలయ్యి ప్రేమగా మారి ఈరోజుటితో జన్మ బంధం అయ్యింది. ఉదయ్ కిరణ్ ని మనువాడిన యువతీ విషిత సాధారణ కుటుంభం నుండి వచ్చిన విషిత మరియు ఉదయకిరణ్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి అన్నవరంలో ఈరోజు పెళ్లి చేసుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా వీరి పెళ్లి జరిగింది పెళ్ళికి దగ్గరి బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. రాత్రి పది గంటల నుంచి పెళ్లివేడుక ప్రారంభమైంది. సినీ హీరో అల్లరి నరేష్ ఈ వేడుకకు హాజరయ్యారు.