తెలుగు చిత్రం పరిశ్రమలో తన పవర్ ఏంటో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో చూపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులన్నింటిని ధ్వంసం చేసి తన స్వంత రికార్డ్లను రాసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తీయాలన్న యోచనలో నిర్మాతలు ఉన్నారు. ఈ చిత్రం 2013లో నిర్మితం అవ్వనుంది. బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రం కోసం రెండు పేర్లను పరిశీలిస్తున్నారు. “గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్” మరియు “గబ్బర్ సింగ్ 2” అనే టైటిల్స్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ రెండింట్లో ఏది ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం ఇంకా మొదటి దశలోనే ఉంది పవన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ పూర్తి అయ్యాక ఈ చిత్రం మొదలు కానుంది. ఇక్కడి “పోకిరి” చిత్రాన్ని అక్కడ “వాంటెడ్” అన్న పేరుతో రీమేక్ చేసి దానికి సీక్వెల్ తీస్తున్న సల్మాన్ ఖాన్ చిత్రం అయిన “దబాంగ్” చిత్రాన్ని ఇక్కడ రీమేక్ చేసి దానికి సీక్వెల్ తీయడం ఆసక్తి కరమయిన విషయం. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు మేము మీకు అందిస్తూ ఉంటాము.