ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి రెండు సర్ ఫ్రైజ్ లు !

జూ ఎన్టీఆర్‌ ఈ నెల 20న తన పుట్టినరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా గ్లింప్స్‌ విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ‘వార్‌ 2’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి తన ఫస్ట్‌లుక్‌ బయటకు రానుందని టాక్ నడుస్తోంది. ఇక మరోవైపు ఈ చిత్ర గ్లింప్స్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్త పై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పుట్టినరోజు నాడు అభిమానులు కొందరు తెల్లవారుజామునే తారక్‌ ఇంటికి చేరుకొని మరి తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version