‘రాజా సాబ్’ ఇంకా బాకీ ఉన్నాడా..?

‘రాజా సాబ్’ ఇంకా బాకీ ఉన్నాడా..?

Published on Oct 2, 2025 7:00 AM IST

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

ఇక ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేయగా దానికి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ చిత్ర షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో రెండు సాంగ్స్ షూటింగ్ బాకీ ఉందని.. వాటి కోసం చిత్ర యూనిట్ అక్టోబర్ 6 నుంచి గ్రీస్ దేశానికి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే, ఇంకా రెండు సాంగ్స్ చిత్రీకరణ ఈ సినిమాకు బాకీ ఉన్నాయని.. దీని తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు