ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్’

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్’

Published on Oct 2, 2025 3:00 AM IST

ఈ ఏడాదిలో హాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ ఫ్రాంచైజ్ చిత్రాల్లో ఏ రేటెడ్ హాలీవుడ్ బ్లడ్ థ్రిల్లర్ చిత్రం “ఫైనల్ డెస్టినేషన్” సిరీస్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంకి అవైటెడ్ పార్ట్ 6 గా వచ్చిన ఈ చిత్రం ఈ ఫ్రాంచైజ్ అభిమానులని థ్రిల్ చేసింది. ఇలా వరల్డ్ వైడ్ పలు భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు అనౌన్స్ చేశారు. ఈ అక్టోబర్ 16 నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇంకా తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో కైట్లిన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, ర్యా కిహ్ల్స్టెడ్, అన్నా లోర్, బ్రెక్ బాసింగర్, టోనీ టాడ్ తదితరులు నటించగా జాచ్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్ లు దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు