హాట్ బ్యూటీ డింపుల్ హయాతి మరోసారి మళ్లీ వార్తల్లోకెక్కింది. తాజాగా ఆమె పై పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్ హయాతి ప్రస్తుతం షేక్ పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్‌మెంటులో ఉంటుంది. అయితే, డింపుల్ హయాతి రెండు కుక్కలను పెంచుకుంటుంది. ఆ కుక్కల సంరక్షణకు ఓ ఏజెంట్‌ని సంప్రదించారు. ఆ ఏజెంట్ ఒడిశా నుంచి ఇద్దరు అమ్మాయిలని తీసుకొచ్చి పనిలో పెట్టింది. రెండ్రోజులు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, డింపుల్ వాళ్లని తిట్టి పంపించేసింది.
ఐతే, ఆ ఇద్దరు యువతలు మాత్రం డింపుల్ హయాతీ నివాసముంటోన్న అపార్ట్‌మెంట్ వద్ద రోడ్డు పక్కన దీనంగా కూర్చోగా, ఆ మహిళలను పనిలో పెట్టిన ఏజెంట్ ఆ వీడియో తీసి హీరోయిన్ బాగోతాన్నంతా బయట పెట్టింది. పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. తమను బూతులు తిట్టింది అని, పైగా మీరు నన్నేం చేయలేరంటూ డింపుల్ రెచ్చిపోయిందని సదరు బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ వివాదంలో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.
case filed against dimple hayathi over maid complaint