రవితేజకి ఒకేసారి రెండు సినిమాలు ?

మాస్ మహరాజా రవితేజ ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అన్నట్టు రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే రమేష్ వర్మ సినిమా కంటే కూడా త్రినాథరావ్ నక్కిన సినిమానే ముందు మొదలవుతుందనుకున్నారు. అన్ని కుదిరితే నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే రమేష్ వర్మ సినిమా కంటే కూడా సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే త్రినాథరావ్ నక్కిన సినిమాతో పాటే రమేష్ వర్మ సినిమా కూడా ఉంటుంది. అదే కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి రమేష్ వర్మ సినిమాని పూర్తి చేసేవాడు.

మొత్తానికి కరోనా వల్ల డేట్స్ కూడా మారిపోయాయి. కాగా నక్కిన త్రినాధరావు – రవితేజ కలయికలో వచ్చే సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు.

Exit mobile version