బిగ్ క్లాష్: ప్రభాస్ సినిమాని ఢీ కొట్టనున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్స్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గానే వచ్చిన టీజర్ అదిరే ట్రీట్ ని ఇచ్చి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎట్టకేలకి రిలీజ్ అప్డేట్ కూడా మేకర్స్ దానితోనే ఇచ్చేసారు.

అయితే డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన ఈ సినిమాకి నార్త్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు వరకు ఈ ఒక్క సినిమానే ఉంది అనుకుంటే ఇపుడు రాజా సాబ్ తో క్లాష్ కి వచ్చేందుకు ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ సిద్ధం అయ్యారు.

టాలెంటెడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ధురంధర్’ లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యి డిసెంబర్ 5 డేట్ ని లాక్ చేసుకుంది. ఇక వీరితో పాటుగా మరో స్టార్ నటుడు షాహిద్ కపూర్ చేస్తున్న ఒక సినిమా కూడా ఇదే డేట్ లో రానుందట. దీనితో మాత్రం నార్త్ మార్కెట్ లో ప్రభాస్ కి గట్టి పోటీ ఎదురైంది అని చెప్పొచ్చు. మరి వీటిలో దేనికి ఎక్కువ ఆదరణ వస్తుందో చూడాలి.

Exit mobile version