టాక్.. ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డెసిషన్ పై ట్విస్ట్?

టాక్.. ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డెసిషన్ పై ట్విస్ట్?

Published on Jun 10, 2025 8:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష, అభిరామి ఫీమేల్ లీడ్ లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “థగ్ లైఫ్”. అయితే ఈ చిత్రం ఊహించని విధంగా తెలుగు సహా తమిళ్ లో కూడా ప్లాప్ గానే నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలకి ముందు మేకర్స్ ఈ సినిమాని ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటిటిలో విడుదల చేస్తామని ముందే క్లారిటీ ఇచ్చేసారు.

కానీ సీన్ కట్ చేస్తే సినిమా ప్లాప్ కావడంలో ఈ ఒప్పందం నుంచి వెనక్కి వస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి వారితోనే మేకర్స్ ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్టుగా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా కమల్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు