SSMB29: ‘వారణాసి’ టైటిల్ ట్విస్ట్.. అటెన్షన్ కోసమా?

SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమాకి “వారాణసి” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆల్రెడీ టాక్ ఉంది. కానీ సరిగ్గా ఇదే టైటిల్ తో మరో సినిమా అనౌన్స్ అయ్యి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

ఆ సినిమాకి ఎలాగో కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ గ్యాప్ లోనే అదే టైటిల్ ఇంకా సనాతన ధర్మం ఎలిమెంట్స్ తో దర్శకుడు సుబ్బారెడ్డి నుంచి అనౌన్స్ అయ్యి పోస్టర్ కూడా వచ్చేసింది. అయితే గతంలో మహేష్ బాబు ఖలేజా చిత్రం సమయంలో కూడా అదే టైటిల్ వేరే వారు తీసుకోవడంతో ‘మహేష్ ఖలేజా’ అని పెట్టారు.

మరి మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మహేష్ బాబు సినిమా పరిశీలనలో ఉన్న టైటిల్ నే ఫిక్స్ చేసేసుకోవడంతో ఇది కావాలని చేసిన పనా సినిమా అటెన్షన్ కోసమే అన్నట్టు నెటిజన్లు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది కానీ సరిగ్గా మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ అప్డేట్స్ కూడా మొదలవుతున్న సమయంలోనే ఈ సినిమా అప్డేట్ కూడా సడెన్ గా బయటకు రావడం గమనార్హం.

Exit mobile version