ట్విస్ట్.. హిందీలో ‘కన్నప్ప’ శాటిలైట్ హక్కులకు గట్టి ధరే పట్టారుగా!

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ ప్రభాస్ అలాగే అక్షయ్ కుమార్ మోహన్ లాల్ లాంటి వారి కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన డివోషనల్ చిత్రమే “కన్నప్ప”. అయితే ఈ సినిమా ఓటిటి డీల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ లోపే ట్విస్ట్ గా శాటిలైట్ అది కూడా హిందీ భాష ఒక్కదానికి మాత్రమే గట్టి మొత్తమే మేకర్స్ అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ముంబైకి చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ కంపెనీతో కన్నప్ప హిందీ వెర్షన్ కి గాను 20 కోట్లు డీల్ తో ముగిసిందట. ఇది పెద్ద మొత్తమే అని చెప్పాలి. ఇక ఓటిటి డీల్ కాకుండా కేవలం శాటిలైట్ హక్కులకే ఇంతమొత్తం అంటే ఓటిటి అన్ని భాషలకి కూడా మంచి ధరే వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి స్టీపెన్ డేవెస్సి సంగీతం అందించగా మంచు మోహన్ బాబు నిర్మాణం వహించారు.

Exit mobile version