ఈ నవంబర్ లో ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం మేకర్స్ మన తెలుగులోనే ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ ఎవర్ స్టెప్ తీసుకొని డ్రోన్ షోని సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిన్న చేశారు.
కర్నూల్ లో నిర్వహించిన ఈ ఆఫ్ లైన్ ఈవెంట్ లో అభిమానులు, ఇతర ప్రేక్షకులు ఆ డ్రోన్ షో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారట. దాదాపు 600 కి పైగా డ్రోన్ లతో సినిమా ట్రైలర్ లాంచ్ ని చేయడం ఎంతో కొత్తగా ఇంట్రెస్టింగ్ గా మారి ఇప్పుడు మన టాలీవుడ్ వర్గాల్లో చర్చగా మారింది. దీనితో మేకర్స్ తాలూకా ఈ కొత్తరకం ప్రమోషన్స్ పై దృష్టి పడింది అని చెప్పవచ్చు. ఇక ఇదే ఫార్మాట్ ని ముందు ముందు మరిన్ని సినిమాలు పాటించినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ అండ్ టీం నుంచి ఈ కొత్త మూవ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
