మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి తాను హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ నవంబర్ లో రిలీజ్ కో రాబోతున్న ఈ సినిమా తాలూకా లేటెస్ట్ ట్రైలర్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ తన నుంచి ఉన్న పలు లైనప్ చిత్రాల్లో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ తో రామ్ ఓ సినిమా చేయనున్నట్టుగా ఇప్పుడు టాక్. మరి దర్శకుడు ఎవరు ఏంటి అనేవి ఇంకా రివీల్ కాలేదు కానీ వీరి కాంబినేషన్ లో అయితే సినిమా ఉండొచ్చట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా విషయానికి వస్తే ఈ సినిమా నవంబర్ 27న గ్రాండ్ గా తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాని దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించారు.
