పవన్, అల్లు అర్జున్ సినిమాల్లో నటించే చాన్స్ వదులుకున్న అనసూయ

Anchor-Anasuya
సుమ, ఝాన్సీ, ఉదయ భాను తరువాత యాంకర్ గా మంచి గుర్తింపు వచ్చిన లేటెస్ట్ టీవీ యాంకర్ అనసూయ. టీవీ షోలలో అలాగే సినిమా వేడుకలలో యాంకర్ గా చేస్తూ కొద్ది నెలల్లోనే ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఈ మద్య ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఒక ప్రముఖ దిన పత్రిక ఇచ్చినఇంటర్వ్యూ లో మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలో నటించడానికి నేను ఒప్పుకోలేదని తెలియజేసింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలో తనకు ఐటమ్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ఈ ఆఫర్ ని నేను తిరస్కరించినట్టు తెలియజేసింది.

అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. కానీ టీవీ షోలతో బిజీగా ఉన్నందు వల్ల ఈ ఆఫర్ ని కూడా ఆమె వదులుకోవలసి వచ్చింది. ఆమెకు ఇష్టం వుంటే మున్ముందు సినిమాలలో నేటించే అవకాశం వుంది. అనసూయ టీవీ షోలతో పాటుగా కొత్త యాక్టర్స కి డబ్బింగ్ కూడా చెబుతుంది.

Exit mobile version