బుల్లితెర నటి ఆత్మహత్య..!

కరోనా కారణంగా ఏర్పడుతున్న పరిస్థితులు అనేక మంది జీవితాలలో చీకటి నింపుతుంది. అనేక మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. చిత్ర పరిశ్రమలోని వర్ధమాన నటులు పరిస్థితి దారుణంగా ఉంది. షూటింగ్స్ లేక కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. కొందరు నటులు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హిందీ నటుడు మన్మీత్ గ్రేవాల్ ముంబైలో ఆత్మ హత్య చేసుకున్నాడు.

తాజాగా మరో బుల్లితెర నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

నిన్న ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ప్రేక్షా గదిలోకి వెళ్లిన ఆమె తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విగతజీవిగా ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Exit mobile version