ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యువ నటీనటులతో కొత్త దర్శకుడు ఫనీంద్ర నర్శెట్టి తెరకెక్కించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం “8 వసంతాలు” కూడా ఒకటి. అయితే ఈ సినిమా లేటెస్ట్ ఈవెంట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్ ఇపుడు ఒకింత సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ చర్చకి దారి తీశాయి.
తాను కమర్షియల్ సినిమాలు చేయడం చేయకపోవడంపై మాట్లాడిన మాటలు ఒకింత నెగిటివ్ దిశలో వెళుతున్నాయని చెప్పవచ్చు. తాను కమర్షియల్ చెయ్యలేక కాదు చెయ్యడం ఇష్టం లేక అనే మాట ఈ సినిమాపై చాలానే కామెంట్స్ వస్తున్నాయి కానీ ఇది ఒక రకంగా సినిమాకే బూస్టప్ గా మారింది అని చెప్పవచ్చు. ఇది వరకు లేని బజ్ మొత్తం దర్శకుని కామెంట్స్ తర్వాత వచ్చింది.
అయితే గతంలో మరో యువ దర్శకుడు కూడా ఇలానే అన్నాడని నెటిజన్స్ కొందరు అంటున్నారు కానీ అది ఆయా దర్శకుల కాన్ఫిడెన్స్ తాలూకా విజ్ఞత అని చెప్పవచ్చు. ఏమో ఊహించని రేంజ్ కమర్షియల్ సినిమాలు తీస్తే ఇపుడు కామెంట్స్ చేస్తున్నవారు కూడా నోరు మూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మాత్రం 8 వసంతాలు సినిమా దర్శకుడు కామెంట్స్ ఒకింత సినిమాకే ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు.